అమెరికాలోని న్యూజెర్సీలో బాలకృష్ణ(balakrishna) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. బాలయ్య జూమ్ మాధ్యమం ద్వారా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
Balakrishna: అమెరికాలో బాలయ్య బర్త్డే వేడుకలు - బాలకృష్ణ తాజా సమాచారం
అమెరికాలో నందమూరి బాలకృష్ణ(balakrishna) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జూమ్ మాధ్యమం ద్వారా అభిమానులతో బాలకృష్ణ తన ఆనందాన్ని పంచుకున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి అమెరికాలోని అభిమానులు అందిస్తున్న సహకారం మరవలేనన్నారు.
balaiah birth day in usa
తెలుగు ప్రజలు, అభిమానులు తనకు ప్రాణ సమానమన్న బాలయ్య.. వారి కోసం చివరి వరకూ నటిస్తూనే ఉంటానని చెప్పారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి అమెరికాలోని అభిమానులు అందిస్తున్న సహకారం మరవలేనన్నారు. హిందూపూరం ఎమ్మెల్యేగా, బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్‌గా బాలయ్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.