KTR on teenmar mallanna tweet: కుటుంబ సభ్యులపై నీచంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా అని భాజపా నేతలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టుపై తీవ్రంగా స్పందించిన మంత్రి... భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్ చేశారు. రాష్ట్ర భాజపా నేతలకు ఇదే నేర్పిస్తున్నారా..? అని కేటీఆర్ నేరుగా ప్రశ్నించారు.
తన కుమారున్ని, అతడి శరీరాన్ని ఉద్దేశించి నీచంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా అని నిలదీశారు. భాజపా నేతల నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా కుటుంబసభ్యులనుద్దేశించి ఇదే స్థాయిలో కామెంట్లు చేయలేమని అనుకుంటున్నారా అని ట్విట్టర్ వేదికగా అడిగారు.