రాష్ట్రంలో కొద్దికాలంలోనే నీలి, గులాబీ విప్లవాలు సాధించగలిగామని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటుతో పాటు ప్రజలకు ఆరోగ్యపుష్టి దొరుకుతోందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ హెచ్ఎండీఏ మైదానంలో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 60 శాతం రాయితీపై జీహెచ్‌ఎంసీ, 29 జిల్లాలకు 117 సంచార చేపల విక్రయ వాహనాలు పంపిణీ చేశారు.
గతంలో ఏ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని... తెలంగాణ వచ్చాకే బడ్జెట్‌లో మత్స్యశాఖకు రూ.100 కోట్లు కేటాయించినట్టు మంత్రి తలసాని తెలిపారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల ద్వారా నీటివనరులు పెరిగాయన్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీతో ఉత్పత్తి పెరిగిందని వివరించారు. సంచార వాహనాల ద్వారా మత్స్యకార మహిళలకు ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో కొన్ని చోట్లే చేపలు దొరుకుతున్నాయన్న హరీశ్‌రావు... మంత్రి తలసాని చొరవతో సంచార చేపల విక్రయ వాహనాలు ఏర్పాటు కావటం సంతోషమన్నారు. మంచినీళ్లలో పెరిగే చేపలకు రుచి ఎక్కువ అని... తెలంగాణలో చేపలు మంచినీటిలోనే పెంచుతున్నాయని వివరించారు. తెలంగాణలో చెరువులకు మహర్దశ వచ్చిందన్నారు. ఏడాదంతా చెరువులు నిండుగా ఉండేలా నింపడమే కాకుండా... ప్రభుత్వం ఉచితంగా చేపలు, రొయ్యలు పంపిణీ చేస్తోందని హరీశ్‌రావు తెలిపారు.