తెలంగాణ

telangana

ETV Bharat / city

'తన ఇంటినే తెలంగాణ ఉద్యమ కార్యాలయంగా మార్చుకున్న మహనీయుడు'

Talasani srinivas yadav On Bapuji Jayanthi: హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ తదితరులు పాల్గొన్నారు. తన ఇంటినే తెలంగాణ ఉద్యమ కార్యాలయంగా మార్చారని మంత్రి తలసాని పేర్కొన్నారు.

By

Published : Sep 27, 2022, 4:14 PM IST

minister talasani srinivas yadav
మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​

Talasani srinivas yadav On Bapuji Jayanthi: తన ఇంటినే తెలంగాణ ఉద్యమ కార్యాలయంగా మార్చారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మూడు ఉద్యమాలకు ఆద్యుడు కొండా లక్ష్మణ్ అని తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మహనీయులను మరింత ఉన్నతంగా గౌరవిస్తుందన్నారు.

తన ఇంటినే తెలంగాణ ఉద్యమ కార్యాలయంగా మార్చారని మంత్రి పేర్కొన్నారు. ఒక్క పద్మశాలీల కోసమే పోరాడలేదని అన్ని వర్గాల పక్షాన పోరాడిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. మహిళలకు బతుకమ్మ సందర్భంగా పంపిణీ చేస్తున్న చీరలను చేనేత కార్మికులు తయారు చేసినవేనన్నారు. వచ్చే సంవత్సరం నుంచి కొండా లక్ష్మణ్ జయంతి గొప్ప పండుగగా ఘనంగా జరపనున్నట్లు తలసాని శ్రీనివాస్​ యాదవ్​ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details