తెలంగాణ

telangana

ETV Bharat / city

బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి సేవలో మంత్రి తలసాని - బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న మంత్రి తలసాని

బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లను కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​. రాష్ట్ర ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

TALASANI
బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి సేవలో మంత్రి తలసాని

By

Published : Jul 6, 2020, 8:19 PM IST

కరోనా మహమ్మారి తొలగిపోయి ప్రజలంతా సంతోషంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ ఆకాంక్షించారు. ఆధివారం.. బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లను కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదాలను స్వీకరించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట సికింద్రాబాద్​ పార్లమెంట్​ తెరాస బాధ్యుడు తలసాని సాయికిరణ్​, అలయ ఈవోలు, ఇతర అధికారులు ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details