తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రత్యేక రాష్ట్రంలో వైభవంగా అన్ని మతాల వేడుకలు: తలసాని - క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్​ బేగంపేట డివిజన్ పరిధిలోని పాటిగడ్డ చర్చిలో... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రిస్మస్ కానుకలు అందజేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్ని మతాల ప్రజలు పండుగలను వైభవంగా జరుపుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

minister thalasani srinivas yadav distribute christmas gifts in patigadda church
ప్రత్యేక రాష్ట్రంలో వైభవంగా అన్ని మతాల వేడుకలు: తలసాని

By

Published : Dec 23, 2020, 7:15 PM IST

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఎంతో వైభవంగా జరుపుకోనేలా రాష్ట్రావతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్​ శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట డివిజన్ పాటిగడ్డ చర్చిలో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు.

బోనాలు, రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ వంటి ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పల తరుణి, మహేశ్వరి, డీసీ ముకుంద రెడ్డి, చర్చి ఫాస్టర్ కిరణ్, తెరాస నాయకులు నరేందర్, శేఖర్, శ్రీనివాస్ గౌడ్, అఖిల్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'దేశానికి దిక్సూచి చూపించిన మహానేత పీవీ'

ABOUT THE AUTHOR

...view details