రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతున్న రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అక్రమాలకు తావులేకుండా సాగాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొదటి దశలో గొర్రెల పంపిణీలో వచ్చిన అవినీతి ఆరోపణలు పునరావృతం కావొద్దని అధికారులకు సూచించారు. మొదటి దశలో ఇచ్చిన గొర్రెలు క్షేత్రంలో ఉన్నాయో లేదో అనే అంశంపై నివేదిక ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో పశుసంవర్ధకశాఖపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
గొర్రెల పంపిణీలో అక్రమాలకు తావుండొద్దు: మంత్రి తలసాని - minister talasani
గొర్రెల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా చూడాలని అధికారులకు మంత్రి తలసాని సూచించారు. అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో పశుసంవర్థకశాఖపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.
minister talasani srinivasa yadav
రాష్ట్రంలో పశు వైద్యశాలలు వైద్యుల పనితీరు, సేవలను మంత్రి ప్రస్తావించారు. పశువుల ఆసుపత్రుల్లో ఔషధాలు వాక్సిన్ల కొరత లేకుండా చూడాలన్నారు. పశువైద్యం అత్యంత కీలకమని... ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో డ్రగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మొబైల్ యాప్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ఇదీ చూడండి: 'ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ'