బన్సీలాల్పేట డివిజన్ సీసీనగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సుమారు రూ.20 కోట్లతో చేపట్టిన 264 ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తలసాని అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఖర్చుతో విశాలమైన, సకల సౌకర్యాలతో ఇళ్లు నిర్మిస్తున్నట్టు వివరించారు.
పేదల సొంతింటి కల నెరవేర్చాలన్నదే సీఎం లక్ష్యం: తలసాని - బన్సీలాల్ పేట సీసీ నగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
పేదల సొంతింటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట డివిజన్ సీసీ నగర్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
పేదల సొంతింటి కల నెరవేర్చాలన్నదే సీఎం లక్ష్యం: తలసాని
తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, ఆర్డీవో వసంత, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, డీఈ గంగాధర్, తహసీల్దార్ బాల శంకర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.