తెలంగాణ

telangana

ETV Bharat / city

పట్టభద్రుల మీద దృష్టి పెట్టండి : మంత్రి తలసాని

త్వరలో జరగనున్న హైదరాబాద్​ - రంగారెడ్డి - మహబూబ్​ నగర్​ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సూచించారు. ఈ మేరకు ఆయన గ్రేటర్​ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లలతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

Minister  Talasani Srinivas Yadav Tele conference On graduates Voter Application
పట్టభద్రుల మీద దృష్టి పెట్టండి : మంత్రి తలసాని

By

Published : Oct 5, 2020, 1:54 PM IST

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యత గల పట్టభద్రులందరూ పాల్గొనాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పిలుపునిచ్చారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసి.. మూడేళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు వేసేందుకు అర్హులే అని.. వారంతా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఈ మేరకు.. ఆయన గ్రేటర్​ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్​లతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. నగరంలోని కాలనీలు, బస్తీలు, అపార్ట్​మెంట్​లలో నివసిస్తున్న గ్రాడ్యుయేట్లను గుర్తించి.. పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

ఇవీ చూడండి:క్రెడిట్‌ కార్డు సైజులో ఆధార్‌.. అప్లై ఇలా..

ABOUT THE AUTHOR

...view details