పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలోని అమీర్పేట, సనత్నగర్ డివిజన్లలో సుమారు రూ.కోటిన్నరతో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అమీర్పేట కార్పొరేటర్ శేష కుమారి, సనత్నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాల్రెడ్డి ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి మొదలుపెట్టారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తలసాని - development programs in ameerpet
హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలోని అమీర్పేట, సనత్నగర్ డివిజన్లలో సుమారు రూ.కోటిన్నరతో పలు అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అమీర్పేట కార్పొరేటర్ శేష కుమారి, సనత్నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాల్రెడ్డి ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి మొదలుపెట్టారు.
minister talasani srinivas yadav integrated development works
గత ప్రభుత్వంలో చేయని అభివృద్ధి పనులకు తన హయాంలో శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన ప్రాంతాలను సైతం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.