గాంధీ, ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించి రోగుల్లో మనోధైర్యం నింపిన సీఎం కేసీఆర్ బాటలోనే మంత్రులు కూడా పయనిస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఆస్పత్రిలోని ట్రామా భవనంలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రులు పరామర్శించారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్యపరిస్థితిని, అందుతున్న వైద్యసేవలను మంత్రులు తెలుసుకున్నారు.
నిమ్స్‌లో రోగులకు మంత్రుల మనోధైర్యం - మంత్రుల నిమ్స్ ఆస్పత్రి సందర్శన
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరామర్శించారు. ఈ ఉదయం ఆసుపత్రికి వెళ్లిన ఇరువురు మంత్రులు ట్రామా భవనంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి... మనోధైర్యాన్నిచ్చారు.
minister talasani and muhammad ali visited nims hospital
వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మందులు, ఆక్సిజన్ సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో నిమ్స్ సంచాలకులు మనోహర్, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకట్‌తో పాటు వైద్యులు మంత్రుల వెంట ఉన్నారు.