పర్యాటకులను ఆకర్షించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టను ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రూపొందించే విధంగా ప్రణాళికలను తయారు చేయాలని అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాలయం సందర్శన కోసం ప్రత్యేక టూరిస్టు ప్యాకేజీని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల పనితీరుపై సచివాలయంలో అబ్కారి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం సమీక్షించారు.
ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా కాళేశ్వరం: శ్రీనివాస్ గౌడ్ - srinivas goud
కాళేశ్వరాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన ప్యాకేజీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
srinivas goud
రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన కార్యచరణను రూపొందించాలని, దానికి సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను తయారు చేయాలని సూచించారు. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పర్యాటక కేంద్రాలను మూడు కొత్త సర్కూట్లుగా తయారు చేసి రాష్ట్రంలో ఉన్న ఇతర చారిత్రక , వారసత్వ , ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధానం చేసి అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆగస్టు 15లోపు మధ్యమానేరుకు కాళేశ్వరం నీరు