రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల ఓటును నమోదు చేసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా స్వయంగా వచ్చి ఓటు నమోదు చేసుకున్నారు.
పట్టభద్రుల ఓటు నమోదు చేసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ - mlc elections schedule
హైదరాబాద్ జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటును నమోదు చేసుకున్నారు. 2017కు ముందు డిగ్రీ పూర్తైన ప్రతీ ఓటరు మళ్లీ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
పట్టభద్రుల ఓటు నమోదు చేసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నేటి నుంచే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదుకు అధికారులు అనుమతించినట్లు మంత్రి తెలిపారు 2017కు ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ యువతకు సూచించారు. ప్రతీ ఓటు విలువైనదేనని... ఓటు హక్కు మనకున్న ఆయుధమని మంత్రి వివరించారు.