పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్, భాజపా నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. నాడు వైఎస్ హయాంలోనే ప్రాజెక్టుకు పునాది పడిందని గుర్తు చేశారు. ఆ రోజు ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ... పదవులకు రాజీనామాలు చేసిన చరిత్ర తెరాసదని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు
నాడు ఎందుకు నోరు మెదపలేదు: శ్రీనివాస్ గౌడ్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు
పోతిరెడ్డిపాడు వ్యవహారంలో కాంగ్రెస్, భాజపా నేతల తీరుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలు ద్వంద వైఖరి అవలంబించండం ఏంటని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా భాజపా నాయకులు లేఖలు రాస్తు కాలయాపన చేయడమేంటని దుయ్యబట్టారు
నాడు ఎందుకు నోరు మెదపలేదు: శ్రీనివాస్ గౌడ్
పీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యాఖ్యలను శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. పదవుల కోసం నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్న రాజశేఖర్‌రెడ్డి మీద ప్రశంసలు కురిపించారని మండిపడ్డారు. జాతీయ పార్టీలకు ద్వంద వైఖరి ఉండొచ్చా అని నిలదీశారు. ఏపీసీసీ, టీపీసీసీ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా భాజపా నాయకులు లేఖలు రాస్తు కాలయాపన చేయడమేంటని దుయ్యబట్టారు.
Last Updated : May 14, 2020, 10:28 PM IST