TS TET: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదా సాధ్యం కాదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొనే టెట్ తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు. జూన్ 12న ఆర్ఆర్‌బీ పరీక్ష కూడా ఉందని ఓ అభ్యర్థి.. మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని పరిశీలించాలని కేటీఆర్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కోరుతూ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.
టెట్ రోజే ఆర్ఆర్‌బీ.. కేటీఆర్‌కు వాయిదా విజ్ఞప్తి.. సబిత ఏమన్నారంటే.. - టెట్ వాయిదాపై మంత్రి సబిత
టెట్ రోజే ఆర్ఆర్‌బీ
14:03 May 21
టెట్ వాయిదా వేయాలని కేటీఆర్‌కు ట్వీట్ చేసిన అభ్యర్థి
కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి... అధికారులతో చర్చించానని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే టెట్ షెడ్యూలు ఖరారు చేసినట్లు ట్వీట్ చేశారు. సుమారు మూడున్నర లక్షల మంది టెట్‌కు హాజరు కానున్నారని తెలిపారు. టెట్ వాయిదా వేస్తే ఇతర ఏర్పాట్లపై ప్రభావం పడుతుందని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి:దిల్లీలో అఖిలేశ్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ
Last Updated : May 21, 2022, 3:35 PM IST