ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసు నుంచి తనను తొలగించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టును కోరారు. ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ పేర్కొన్న అభియోగాలు నిరాధారమని ఆమె పేర్కొన్నారు. తనను అనవసరంగా కేసులో ఇరికించారంటూ సీబీఐ న్యాయస్థానంలో డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐ కోర్టులో మంత్రి సబితా డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు - విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజా వార్తలు
ఓబుళాపురం గనుల కేసులో తనను అనవసరంగా ఇరికించారంటూ సీబీఐ న్యాయస్థానంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ పేర్కొన్న అభియోగాలు నిరాధారమని.. తనను కేసు నుంచి తొలగించాలని కోరారు.
ఓఎంసీ కేసులో అభియోగాల నమోదుపై గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గాలి జనార్దన్ రెడ్డిపై మోపిన సీబీఐ అభియోగాలన్నీ తప్పని.. వాటిని కొట్టివేయాలని కోరారు. గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ డిశ్ఛార్జ్ పిటిషన్పై ఆయన తరఫు న్యాయవాది ఖాసిం వాదనలు వినిపించారు. బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి తదితర నిందితులు వాదనలు వినిపించేందుకు సమయం కోరారు. ఓఎంసీ కేసు తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: ఈ నెల 9న నేరేడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు