తెలంగాణ

telangana

ETV Bharat / city

PERNI NANI: 'మా' ఎన్నికలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు: పేర్ని నాని

మా ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. తాము ఏ వర్గాన్ని సపోర్ట్​ చేయడం లేదని తెలిపారు.

PERNI NANI: 'మా' ఎన్నికలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు: పేర్ని నాని
PERNI NANI: 'మా' ఎన్నికలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు: పేర్ని నాని

By

Published : Oct 4, 2021, 4:28 PM IST

Updated : Oct 4, 2021, 5:07 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (movie artists association elections) ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని(minister perni nani) స్పష్టం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎన్నికలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. ఈ ఎన్నికలలో ఏ వ్యక్తినీ, ఏ వర్గాన్నీ సమర్థించడం లేదని వివరించారు.

చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో జగన్​మోహన్​ రెడ్డికి గానీ, వైఎస్సార్​సీపీ పార్టీకి గానీ, ఏపీ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ జరిగే ఎన్నికలకి ప్రభుత్వానికి, జగన్​మోహన్​ రెడ్డికి ఏ మాత్రం ఉత్సాహం, సంబంధం లేదు. -పేర్ని నాని, ఏపీ సమాచార, రవాణా శాఖ మంత్రి

బరిలో ఎవరెవరున్నారంటే..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో (MAA ELECTIONS 2021) పోటీపడే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఈ మేరకు పోటీలో ఉన్న వారి జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు. 2021-23 కార్యవర్గానికి సంబంధించి మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా.. 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతుండగా... స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీవీఎల్ నర్సింహారావు, కె.శ్రావణ్ కుమార్ చివరి నిమిషంలో తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య అధ్యక్ష పోటీ ఖరారైంది.

మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. మా అసోసియేషన్​లో ఉండే రెండు వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు మంచు విష్ణు ప్యానెల్ నుంచి పృథ్వీరాజ్, మాదాల రవి పోటీలో ఉండగా... ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జి, హేమ పోటీలో ఉన్నారు. అత్యంక కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవిత రాజశేఖర్, రఘుబాబు, బండ్ల గణేశ్ నామినేషన్ దాఖలు చేయగా... పెద్దల సూచలతో బండ్ల గణేశ్ తప్పుకున్నారు. దీంతో ఆ పోస్టుకు జీవితరాజశేఖర్, రఘుబాబులు బరిలో నిలిచారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా... రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో ఉన్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. మిగతా 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో తుది జాబితాను వెల్లడించిన కృష్ణమోహన్.. అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఫిల్మ్​నగర్​లోని జూబ్లీ పబ్లిక్ పాఠశాలలో జరిగే మా ఎన్నికలకు ఈవీఎంల ద్వారా పోలింగ్ జరపనున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు.

ఇదీ చదవండి: ktr appreciates traffic police: తన వాహనానికి చలానా విధించిన పోలీసులపై కేటీఆర్​ ప్రశంసలు

Last Updated : Oct 4, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details