తెలంగాణ

telangana

ETV Bharat / city

Deputy CM Naryanaswamy : నా చర్మంతో జగన్​కు చెప్పులు కుట్టించినా ఆ రుణం తీర్చుకోలేను

తన చర్మంతో ఏపీ సీఎం జ‌గ‌న్​కి చెప్పులు కుట్టించినా ఆయ‌న రుణం తీర్చుకోలేననని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. జగన్ పాలనలోనే ద‌ళితుల‌కు రాజ‌కీయంగా, ఆర్థికంగా నిజ‌మైన స్వాతంత్రం వ‌చ్చిందని కొనియాడారు.

dy cm naryanaswamy
dy cm naryanaswamy

By

Published : Nov 1, 2021, 7:57 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే ద‌ళితుల‌కు రాజ‌కీయంగా, ఆర్థికంగా నిజ‌మైన స్వాతంత్రం వ‌చ్చిందని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. జగన్ తనకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి ఓ చ‌రిత్ర సృష్టించారన్నారు. వాణిజ్య పన్నుల శాఖను తన నుంచి తొలగించి ఎక్సైజ్ శాఖకే పరిమితం చేయటంపై కొందరు తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన చర్మంతో జ‌గ‌న్​కు చెప్పులు కుట్టించినా ఆయ‌న రుణం తీర్చుకోలేననని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప‌థ‌కాలు ద‌ళితుల‌ను వ్య‌క్తిగ‌తంగా అభివృద్ది చేస్తాయన్నారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ పాల‌న‌ను దేశం మొత్తం ఆద‌ర్శంగా తీసుకుంటుందని చెప్పారు. వ‌చ్చే ఏడాది నిరుపేద‌లైన‌ ద‌ళితుల‌కు భూ పంపిణీ చేయ‌మ‌ని సీఎం జ‌గ‌న్​కు చెప్పానని..ఆయ‌న సానుకులంగా స్పందించారన్నారు.

'నా చర్మంతో సీఎం జ‌గ‌న్​కు చెప్పులు కుట్టించినా ఆయ‌న రుణం తీర్చుకోలేను'

ఏపీ వాణిజ్య పన్నుల శాఖను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి(deputy cm narayanaswamy) వద్ద నుంచి ప్రభుత్వం ఆదివారం తప్పించింది. ఆ శాఖను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(finance minister buggana rajendranath)కి అప్పగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం నారాయణస్వామి వద్ద ఎక్సైజ్ శాఖ(excise department) మాత్రమే ఉంది. వాణిజ్య పన్నులు, స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించినా.. అభ్యంతరాలు వ్యక్తమవటంతో అమలు కాలేదు. వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రికి బదలాయించగా.. త్వరలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖనూ మార్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి :Deputy cm: డిప్యూటీ సీఎం నుంచి ఆ శాఖ తొలగింపు..

ABOUT THE AUTHOR

...view details