సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన యోధుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. అందరిలో స్ఫూర్తి నింపిన ఉద్యమకారుడని చెప్పారు.
విజనరీ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనమని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు కుమారుడిని కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు.