తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR On Congress: 'భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్​పై కాంగ్రెస్​ అధ్యక్షుడు బాధపడుతున్నారు'

KTR On Congress: బడ్జెట్​ పద్దులపై చర్చలో సందర్భంగా కేటీఆర్​, భట్టి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకొంది. గతంలో కాంగ్రెస్​ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్​ స్పందించగా.. దానిని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. భాజపా, కాంగ్రెస్​ను అవిభక్త కలలలుగా కేటీఆర్​ అభివర్ణించారు.

KTR On Congress
ktr vs bhatti

By

Published : Mar 10, 2022, 5:27 PM IST

Updated : Mar 10, 2022, 7:44 PM IST

KTR On Congress: భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందన్​రావు, రాజాసింగ్​ సస్పెన్షన్​పై కేటీఆర్​ స్పందించారు. వారిని సస్పెండ్​ చేయడంపై భాజపా అధ్యక్షుడు కంటే కాంగ్రెస్​ అధ్యక్షుడే ఎక్కువ బాధపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. భాజపా, కాంగ్రెస్​ అవిభక్త కవలలుగా అభివర్ణించారు. దీంతో సభలో ఒక్కసారిగా దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడితే అండగా ఉంటామని.. కానీ సభలో లేని వ్యక్తి కోసం మాట్లాడడం సరికాదన్నారు. కేటీఆర్​ వ్యాఖ్యలను తప్పుబట్టారు. భట్టి వ్యాఖ్యలపై కేటీఆర్​ స్పందించారు. భట్టి చాలా మంచివారని.. కానీ వారి అధ్యక్షుడే అక్రమార్కులంటూ ఆరోపణలు చేశారు. దీనిపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత భట్టి.. కేటీఆర్​ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్​ను కోరారు.

ఇంతలో జోక్యం చేసుకున్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి.. కాంగ్రెస్​ తీరును తప్పుబట్టారు. సీఎం కేసీఆర్​ పుట్టినరోజున రేవంత్​ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పుట్టినరోజున సంతాప దినాలుగా చేసుకోవాలని సూచించడంపై మండిపడ్డారు. అలాంటి అధ్యక్షుడు కాంగ్రెస్​ పార్టీకి ఉండడం వారి దురదృష్టమంటూ వ్యాఖ్యానించారు. దీనిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భట్టి విక్రమార్క.. ఎక్కడో బయట మాట్లాడిన మాటలను సభలో ప్రస్తావించడం సబబుకాదన్నారు. ఇది సంస్కారం కాదన్నారు.

ఈ సందర్భంగా మరోసారి జోక్యం చేసుకున్న కేటీఆర్​.. రాహుల్​ గాంధీపై అసోం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ప్రస్తావించారు. రాహుల్​ గాంధీకి తొలుత అండగా నిలిచింది.. సీఎం కేసీఆర్​ అని గుర్తుచేశారు. తాము ఎవరి దగ్గరా సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.

KTR On Congress: 'భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్​పై కాంగ్రెస్​ అధ్యక్షుడు బాధపడుతున్నారు'

ఇదీచూడండి:KTR In Assembly: 'నాడు అచ్చేదిన్​ అన్నారు... అది కాస్త చచ్చేదిన్​ అయింది'

Last Updated : Mar 10, 2022, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details