కౌలాలంపూర్, మనీలా విమానాశ్రయాల్లో రెండోరోజూ భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా దృష్ట్యా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చే విమానాలు నిలిపివేశారు. అధికారులు స్పందించక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ చిక్కుకున్న విద్యార్థులను కాపాడండి: కేటీఆర్ - coronavirus disease
మనీలా, కౌలాలంపూర్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను కాపాడాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ట్విటర్లో కోరారు.
ktr
దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కౌలాలంపూర్, మనీలాలో చిక్కుకున్న వారిని కాపాడాలని కేంద్రాన్ని కోరారు. స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరిని ట్విటర్లో కోరారు.
ఇదీ చూడండి:కరోనా ఎక్కడొచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో కలవరమే..