'హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాం' - assembly sessions 2020
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. నగరాభివృద్ధికి రూ.30 వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఇప్పటి వరకు రూ.4 వేల కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గించడానికి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినట్లు తెలిపిన మంత్రి... ఎస్‌ఆర్‌డీపీ కింద 18 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. పక్షపాతమేమిలేకుండా... ఓల్డ్‌సిటీని సైతం అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
minister ktr on hyderabad development in assembly