తెలంగాణ

telangana

ETV Bharat / city

నిర్మాణ రంగానికి అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్​

కరోనా సంక్షోభం, లాక్డౌన్ వల్ల తలెత్తిన పరిమాణాల నేపథ్యంలో హైదరాబాద్ నిర్మాణరంగాన్ని గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణరంగ ప్రతినిధులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. నిర్మాణరంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

నిర్మాణ రంగానికి ప్రభుత్వం పూర్తి అండ: కేటీఆర్​
నిర్మాణ రంగానికి ప్రభుత్వం పూర్తి అండ: కేటీఆర్​

By

Published : Jul 4, 2020, 8:00 PM IST

హైదరాబాద్ నిర్మాణరంగం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితులు, నిర్మాణ రంగ భవిష్యత్​పై చర్చించారు. సిమెంట్ ధరలు, ఇసుకకు సంబంధించి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్​ హామీ ఇచ్చారు. నూతన పురపాలక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని, చెరువులు, బహిరంగ ప్రాంతాల్లో మట్టి, నిర్మాణవ్యర్ధాలు పారేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఉపశమన చర్యలు..

దేశంలో ఇతర మెట్రో నగరాల్లో నిర్మాణరంగ పరిస్థితి అయోమయంలో ఉందని, హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయని మంత్రికి తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న ఉపశమన చర్యలను మంత్రికి వివరించారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్​ నిర్మాణ రంగానికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ క్రమానుగతంగా అద్భుత ప్రగతి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా.. భాగస్వామ్యులు కావాలని నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులను కోరారు.

కార్మికుల వివరాలను క్రోడీకరించి..

ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు ఇచ్చిన భరోసా వల్లే చాలామంది కార్మికులు తిరిగి హైదరాబాద్​లో పనిచేసేందుకు వస్తున్నారని మంత్రి అన్నారు. ప్రస్తుతం నిర్మాణ సైట్ల వద్ద పనిచేస్తున్న అతిథి కార్మికుల వివరాలను క్రోడీకరించి ప్రభుత్వానికి అందించాలని కేటీఆర్​ కోరారు. తద్వారా సంక్షోభ సమయాల్లో సాధ్యమైనంత త్వరగా, ప్రభావవంతంగా సహాయక చర్యలు అందించే అవకాశం ఉంటుందన్నారు.

ఇవీ చూడండి:సీఎం నివాసం వద్ద కరోనా కలకలం.. 8 మందికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details