రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడిచినా... తమ నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధులు రావటంలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. తమకు సిరిసిల్ల, సిద్దిపేట లాంటి పట్టణాలు కావాలని లేదని... రూ.100 కోట్ల బడ్జెట్ కావాలని కోరుకోవటం లేదని... ప్రభుత్వం తమ నియోజకవర్గాన్ని ఓ సారి చూడాలని కోమటిరెడ్డి కౌంటర్ వేశారు.
'జీరో అవర్‌లో హీరోగిరి చేస్తానంటే ఎట్లా అధ్యక్షా..!' - ktr counter
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిసే సమయంలో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌కు మధ్య కౌంటర్, ఎన్కౌంటర్ జరిగింది. కోమటిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సభలో వాస్తవాలు మాట్లాడాలని రాజ్గోపాల్కి మంత్రి సూచించారు.
minister ktr encounter to komatireddy rajgopal reddy counter
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తాము ఏమీ చేయకపోతే... 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే... 122 ఛైర్మన్ పదవులు తెరాసకు ఎలా వస్తాయని కోమటిరెడ్డిని మంత్రి కేటీఆర్ తిరిగి ప్రశ్నించారు. సత్యదూరమైన మాటలు మానేసి... నిజాలు మాట్లాడాలని మంత్రి కోరారు. జీరో అవర్‌లో హీరోగిరి చేస్తే మంచిది కాదంటూ... తనదైన శైలిలో కేటీఆర్ సమాధానమిచ్చారు.
ఇదీ చూడండి: శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణకు హాజరైన దేవరాజ్
Last Updated : Sep 10, 2020, 4:09 PM IST