గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్న అడవులు, పకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకం, వేదాలలో పకృతి వృక్షాల గురించి వివరించే వృక్ష వేదం పుస్తకాన్ని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తెరాస కార్యనిర్వహక అధ్యక్షులు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రయత్నం అభినందనీయం: కేటీఆర్ - గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు కేటీఆర్ అభినందనలు
తెలంగాణలోని ప్రకృతి అందాలు, వృక్ష వేదం పుస్తకాలను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్... మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్... సంతోష్‌ను, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ సభ్యులను అభినందించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రయత్నం అభినందనీయం: కేటీఆర్
తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన అడవులను, పకృతి అందాలను పుస్తకంలో అద్భుతంగా చూపించారని మంత్రి కేటీఆర్... సంతోష్‌ను అభినందించారు. వృక్ష వేదం పుస్తకాన్ని తీసుకువచ్చిన జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.