సాధారణ ప్రజలకు డిజిటల్ సాధనాలు చేరినప్పుడు మాత్రమే డిజిటల్ విప్లవం సాధ్యమవుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సాంకేతికతను ఉపయోగించినప్పుడు వారికి నమ్మకం కలుగుతుందని, తద్వారా సామాజిక పరివర్తన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కొవిడ్ అనంతరం డిజిటల్ విప్లవం అనే అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌కు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
'దేశం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే డిజిటల్ అక్షరాస్యత పెరగాలి' - ktr latest news
భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే డిజిటల్ అక్షరాస్యత పెరగాలన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సాధారణ ప్రజలకు డిజిటల్ సాధనాలు చేరినప్పుడు మాత్రమే డిజిటల్ విప్లవం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బ్రాడ్ బ్యాండ్‌తో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్రానికి సూచించారు.
ktr
భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే డిజిటల్ అక్షరాస్యత పెరగాలని కేటీఆర్ అన్నారు. బ్రాడ్ బ్యాండ్‌తో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాలను ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్‌లో భాగస్వాములయ్యేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఇదీ చదవండి:షూటింగ్స్‌కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Last Updated : May 23, 2020, 12:45 PM IST