తెలంగాణ

telangana

ETV Bharat / city

నింబోలి అడ్డా హాస్టల్ విద్యార్థులకు భరోసానిచ్చిన మంత్రి - nimboli adda hostel repairs news

హైదరాబాద్​లో కాచిగూడ నింబోలి అడ్డాలోని ఎస్సీ బాలుర హాస్టల్​ విద్యార్థులు మంత్రి కొప్పుల ఈశ్వర్​ను కలిసి వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. హాస్టల్ భవనానికి అవసరమైన మరమ్మతులు పరీక్షల తర్వాతే చేపడతామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

minister koppula eshwar promised for nimboli adda hostel repairs
minister koppula eshwar promised for nimboli adda hostel repairs

By

Published : Jan 27, 2021, 1:28 PM IST

హైదరాబాద్​లో కాచిగూడ ఎస్సీ బాలుర హాస్టల్ మరమ్మతులపై విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందొద్దని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. చాలా ఏళ్ల కిందట నిర్మించిన కాచిగూడ నింబోలి అడ్డాలోని ఎస్సీ బాలుర హాస్టల్​కు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఇటీవల అధికారులు నిర్ణయించారు. మంత్రిని కలిసిన విద్యార్థులు... డిగ్రీ, పీజీ, లా పరీక్షలు ఉన్నందున మరమ్మతులను వాయిదా వేయాలని... భోజన వసతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈమేరకు పలువురు హాస్టల్ విద్యార్థులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి... హాస్టల్ భవనానికి అవసరమైన మరమ్మతులు పరీక్షల తర్వాతే చేపడతామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. వివిధ కోర్సుల పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యాక మరమ్మతులు చేపట్టాలని.. అందులో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు మంత్రి కొప్పుల పలు సూచనలు చేశారు.

ఇదీ చూడండి:'నేను కాళికను.. నేనే శివుడిని'

ABOUT THE AUTHOR

...view details