రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కూడా కేంద్రం సక్రమంగా ఇవ్వట్లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వేల కోట్లు కేంద్రానికి వెళ్తున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ చక్కని పథకమని.. నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం నిధులు ఇవ్వలేదని మంత్రి చెప్పారు. కేంద్రమంత్రి గానీ, భాజపా ఎంపీలు గానీ నిధులేమైనా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి పొగడ్తలే తప్ప... నిధులు ఇచ్చింది లేదన్నారు.
భాజపా,తెరాస మేనిఫెస్టోలపై చర్చకు కిషన్ రెడ్డి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ప్రజలపై రోజుకో బండ వేస్తున్నది ఎవరో చెప్పాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధర వంద చేసింది ఎవరంటూ జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. భాజపాకు షాక్ ఇచ్చేందుకు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయని చెప్పారు.