తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తన్నీరు హరీష్‌రావును... వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య విభాగం సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్‌రెడ్డి, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తదితరులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు పుష్ప గుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ పనితీరుపై మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు.
Health minister review: 'వైద్యులు సమయానికి విధులకు వచ్చేలా చూడండి' - తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి
వైద్యారోగ్య శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తన్నీరు హరీష్‌రావు.. ఆ శాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు హరీశ్‌రావుకు అభినందనలు తెలిపారు.
అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నారని ఈటల రాజేందర్‌పై ఆరోపణలు వచ్చిన సమయంలో ఈటల నుంచి వైద్యారోగ్య శాఖను తప్పించారు. శాఖను ఎవరికీ కేటాయించకుండా సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. ఆ తరువాత ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి వద్దే వైద్యారోగ్య శాఖ ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖను హరీశ్ రావుకు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థికశాఖతో పాటు వైద్యారోగ్యశాఖ బాధ్యతలను హరీశ్‌రావు చూడనున్నారు.
ఇదీచూడండి:Telangana Health Minister: కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆ బాధ్యతలు హరీశ్‌రావుకి అప్పగింత