కరోనా లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స పొందాలని మంత్రి ఈటల శాసనమండలిలో మరోసారి స్పష్టం చేశారు. కరోనా తీవ్రత పెరిగిందంటే బాధితులను రక్షించడం కష్టమవుతుందని పునరుద్ఘాటించారు. కరోనా చికిత్సలు అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కారకర్తల కృషి ప్రశంసనీయమని ఈటల అభినందించారు. ఆరోగ్య కార్యకర్తల కృషికి మనం ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందని కొనియాడారు. లంగ్ ఇన్‌ఫెక్షన్ సిటీ స్కాన్‌లో మాత్రమే తెలుస్తుందన్న ఈటల.. అన్ని వైద్యశాలల్లో ఈ పరీక్షలకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారని స్పష్టం చేశారు.
'ఆరోగ్య కార్యకర్తల కృషికి మనం ఎంత ఇచ్చినా తక్కువే' - తెలంగాణ అసెంబ్లీ వర్షకాలం సమావేశాలు 2020
కరోనాపై పోరులో ఆరోగ్య కార్యకర్తల కృషికి మనం ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్రర్ అన్నారు. కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల కృషి ప్రశంసనీయమన్నారు. వారి పాదాలకు మొక్కినా రుణం తీర్చుకోలేమని కొనియాడారు. కరోనాకు సంబంధించి మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
'ఆరోగ్య కార్యకర్తల కృషికి మనం ఎంత ఇచ్చినా తక్కువే'