రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి సంక్షేమం కోసం తాపత్రయ పడుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న పేదకుంటుబాలు ముఖ్యమంత్రిని పెద్దకొడుకుగా భావిస్తున్నారని గుర్తుచేశారు. కేవలం వృద్ధులకే కాకుండా... వితంతువులు, వికలాంగులు, చేనేతలకు పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
కేంద్రం ఇస్తుంది కేవలం 1.8 శాతం మాత్రమే: మంత్రి ఎర్రబెల్లి - assembly sessions updates
రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న పేదకుంటుబాలు ముఖ్యమంత్రిని పెద్దకొడుకుగా భావిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పింఛన్లు మొత్తం కేంద్రమే ఇస్తోందని కొందరు నేతలు ప్రజల్లో అపోహలు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. మొత్తం పింఛన్ల నిధుల్లో 1.8 శాతం మాత్రమే కేంద్రం ఇస్తోందని మంత్రి వివరించారు.
MINISTER ERRABELLI ON PENSION FUNDS IN ASSEMBLY
పింఛన్లపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి... వృద్ధుల పెన్షన్ వయసును 57ఏళ్లకు కుదించిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా వల్ల అమలు చేయలేకపోయమన్న ఎర్రబెల్లి... వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. పింఛన్లు మొత్తం కేంద్రమే ఇస్తోందని కొందరు నేతలు ప్రజల్లో అపోహలు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. మొత్తం పింఛన్ల నిధుల్లో 1.8 శాతం మాత్రమే కేంద్రం ఇస్తోందని మంత్రి వివరించారు.