ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.
నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల
హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి జ్వర పీడితులతో కిక్కిరిసిపోయింది. ఈక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులతో కలిసి వార్డులు పరిశీలించారు. వైద్య సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే ఆస్పత్రికి వచ్చిన కాంగ్రెస్ నేత వీహెచ్‌ను ఈటల మాట్లాడారు. వైద్య సౌకర్యాలు, ఆస్పత్రి అభివృద్ధి విషయాల గురించి ఈటలకు వీహెచ్ వివరించారు.
- ఇదీ చూడండి : యూట్యూబ్‌లో మాతృభాషకే వీక్షకుల జై!
Last Updated : Sep 3, 2019, 1:19 PM IST