కరోనా బాధితులకు జిల్లా స్థాయి నుంచి వికేంద్రీకరణ పద్ధతిలో చికిత్స అందేలా చూడాలని అధికారులకు మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. బీఆర్కే భవన్లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాంధీతో పాటు హైదరాబాద్లోని ఇతర టెర్షియరీ కేర్ ఆస్పత్రుల్లోనూ పూర్తి స్థాయిలో కరోనా చికిత్స అందించాలని ఆదేశించారు.
'గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఐసోలేషన్ ఏర్పాటు చేయండి'
జిల్లాల్లోనూ కరోనా చికిత్స అందించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. మెడికల్ కాలేజీల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. లక్షణాలు లేని కరోనా రోగులను హోం ఐసోలేషన్లో ఉంచాలని పేర్కొన్నారు. సదుపాయం లేని వారికి గ్రామ, మండల, జిల్లా స్థాయి ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లాల్లోనూ కరోనా చికిత్స అందించాలని మంత్రి సూచించారు. మెడికల్ కాలేజీల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మల్లారెడ్డి, మమత, ఆర్వీఎం, ఎంఎంఆర్, అపోలో, కామినేని మెడికల్ కాలేజీల్లో రోగులకు చికిత్స అందించాలని స్పష్టం చేశారు. లక్షణాలు లేని కరోనా రోగులను హోం ఐసోలాషన్లో ఉంచాలని... సదుపాయం లేని వారికి గ్రామ, మండల, జిల్లా స్థాయి ఐసోలేషన్ ఏర్పాటు చేయడంతో పాటు.... అన్ని అసుపత్రుల్లోనూ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!