తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister Anil On Chandrababu: 'బాబు ఏజెంట్లే.. కేంద్ర మంత్రితో అలా చెప్పించారు'

Minister Anil On Chandrababu: భాజపాలోని చంద్రబాబు ఏజెంట్లు కేంద్ర మంత్రి షెకావత్​తో.. అవాస్తవాలు చెప్పించారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. వరదలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న మంత్రి.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విపత్తులు రాలేదా? అని​ ప్రశ్నించారు.

minister-anil-comments-on-chandrababu
minister-anil-comments-on-chandrababu

By

Published : Dec 4, 2021, 5:49 PM IST

Minister Anil On Chandrababu: విపత్తు వస్తే చాలు.. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యం అని తేల్చేస్తే ఎలా? అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విపత్తులు రాలేదా? అని మంత్రి​ ప్రశ్నించారు. కేంద్ర జలసంఘం లెక్కల ప్రకారం సోమశిలకు 140 ఏళ్ల తర్వాత ఇంతపెద్దస్థాయిలో వరద వచ్చిందని పేర్కొన్నారు.

అన్నమయ్య ప్రాజెక్టులో ఒకగేటు ఎత్తకపోవడం వల్లే ఇంత ప్రమాదం వచ్చిందని ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్ వే నుంచి కొద్ది గంటల్లోనే 3.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని.. అందుకే భారీగా నష్టం వాటిల్లిందని, ఇది ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు.

Minister Anil On Floods ఈ స్థాయిలో వరద వస్తుందని కేంద్ర జల సంఘం కూడా హెచ్చరించలేదన్నారు. 2017లోనే ప్రాజెక్టుకు కొత్తస్పిల్ వే కట్టాలని డ్యాం సేఫ్టీ అధికారులు హెచ్చరించినా.. చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అందుకే.. ఆకస్మిక వరదలకు డ్యాం కొట్టుకుపోయిందన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ కూడా వాస్తవాలు తెలియకుండా మాట్లాడారని మంత్రి వ్యాఖ్యానించారు. భాజపాలోని చంద్రబాబు ఏజెంట్లు కేంద్ర మంత్రికి అలా నేర్పి ఉంటారని అనిల్ యాదవ్ ఆరోపించారు.

ఇదీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details