తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2020, 4:51 PM IST

Updated : Aug 5, 2020, 5:08 PM IST

ETV Bharat / city

'హిందుత్వ విజయమా.. భారతావని విజయమా..?'

రామమందిర భూమి పూజలో ప్రధాని పాల్గొనడాన్ని ఓవైసీ తీవ్రంగా ఖండించారు. 'నేటి భూమిపూజ హిందుత్వ విజయమా, భారతావని విజయమా? అని ప్రశ్నించారు. లౌకికతత్వాన్ని కాపాడతానని రాజ్యంగ సాక్షిగా ప్రమాణం చేసిన ప్రధాని నేడు అదే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.

'హిందుత్వ విజయమా.. భారతావని విజయమా..?'
'హిందుత్వ విజయమా.. భారతావని విజయమా..?'

ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామమందిర భూమి పూజలో ప్రధాని పాల్గొనడాన్ని ఓవైసీ తీవ్రంగా ఖండించారు. 'నేటి భూమిపూజ హిందుత్వ విజయమా, భారతావని విజయమా? అని ప్రశ్నించారు. పూజా కార్యక్రమం అనంతరం మాట్లాడిన ప్రధాని భావోద్వేగానికి గురయ్యారని, తాను కూడా అదే సమయంలో భావోద్వేగానికి లోనయ్యానని తెలిపారు. 450 ఏళ్లగా మసీదు ఉన్న ప్రాంతంలో, ముస్లింలు పవిత్ర స్థలంగా భావించే ప్రాంతంలో ఆర్​ఎస్​ఎస్​, భజరంగదళ్​, వీఎస్​ఎప్సీ నేతలంతా కలిసి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుకు కొన్ని రోజుల ముందే ప్రధాని ఇచ్చిన సంకేతాలు దేనికి నిదర్శనమన్నారు.

'హిందుత్వ విజయమా.. భారతావని విజయమా..?'

లౌకికతత్వాన్ని కాపాడతానని రాజ్యంగ సాక్షిగా ప్రమాణం చేసిన ప్రధాని నేడు అదే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. అన్ని మతాల వారు పోరాడితేనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒక్క హిందువులు మాత్రమే స్వాతంత్రం కోసం పోరాడలేదన్నారు. నేడు జరిగిన భూమిపూజ స్వతంత్ర భారతావని విజయం కాదన్నారు. కాంగ్రెస్​ కూడా ఈ వేడుకకు మద్దతు తెలపడం పట్ల ఆయన మండిపడ్డారు. ముస్లింలకు న్యాయం జరిగిందని మీరెలా అనుకుంటున్నారని ప్రధానపార్టీలను ఆయన నిలదీశారు.

సంస్కృతి మాత్రమే..

దేశానికి చిహ్నం అంటే ఒక మందిరం, మసీదు నిర్మాణం కాదని సంస్కృతి మాత్రమే చిహ్నంగా నిలుస్తుందని ఓవైసీ తెలిపారు. ఒక మతానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహారించారని ఆయన విమర్శంచారు. మందిర భూమి పూజను స్వాతంత్ర దినోత్సవంతో పోల్చి స్వాతంత్ర సమరయోధులను ప్రధాని అవమాన పరుస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.

మోనంగా వేడుక చూశారు..

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్​ మందిర నిర్మాణానాన్ని నవ భారతంగా అభిప్రాయపడుతున్నారని... భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​తో పాటు ఇతర లౌకిక పార్టీలన్ని మోనంగా వేడుక చూశాయని.. గొంతెత్తితే ఎక్కడ ఓట్లు పోతాయోనని మౌనంగా ఉంటున్నాయని దుయ్యబట్టారు.

ఇవీ చూడండి: రామాలయ భూమిపూజపై ఎవరేమన్నారంటే..

Last Updated : Aug 5, 2020, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details