రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో భవన నిర్మాణ, వలస కార్మికులు సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ప్రభుత్వం కేవలం 4 గంటలు సడలింపు ఇవ్వటంతో వెసులుబాటు కల్పించిన సమయంలోనే రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. ప్రయాణికులు గుమిగూడకుండా గంట ముందు మాత్రమే రైల్వే సిబ్బంది వారిని లోపలికి అనుమతిస్తున్నారు. బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఎక్కువగా ప్రయాణికులు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. కొందరికి టిక్కెట్లు దొరక్క... మరికొందరికి రిజర్వేషన్ కన్ఫార్మ్ అవ్వక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే నిద్రిస్తున్నారు.
ముందుకొస్తున్న దాతలు
నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు ఎక్కువ సంఖ్యలో వలస కార్మికులు వస్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేసన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళుతున్న వలస కార్మికులకు... పోలీసులు భోజనం, మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు రైళ్ల వివరాలు, రిజర్వేషన్ వంటి విషయాలను వారికి తెలియజేస్తున్నారు. కార్మికులకు అండగా నిలిచేందుకు పోలీసులతో పాటు మరికొందరు దాతలు ముందుకొస్తున్నారు. నిత్యం సుమారు 80 నుంచి 100 మందికి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
ముందే చేరుకుంటున్నారు..