మెట్రో రైలు వేళలు పొడిగింపు.. ఎప్పటివరకంటే.? - మెట్రో టైమింగ్స్
17:25 October 07
మెట్రో రైలు వేళలు పొడిగింపు
Hyderabad Metro: మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రోలో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే టర్మినల్ సేషన్ల నుంచి చివరి మెట్రో ఉండేది. దీన్ని మారుస్తూ.. ఈనెల 10 నుంచి టర్మినల్ స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మెట్రో రైలు వేళలు పొడిగించినట్టు చెప్పారు. ఎప్పటి లాగే ఉదయం 6గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయి.
ప్రయాణికుల నుంచి క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో మెట్రోరైలు వేళలను క్రమంగా పొడిగించుకుంటూ వస్తున్నారు.పెట్రోల్ ధరలు భారీగా పెరగడం, ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటం, రహదారులపై ట్రాఫిక్ దృష్ట్యా వేగంగా గమ్యం చేరేందుకు ప్రయాణికులు తిరిగి మెట్రో వైపు చూస్తున్నారు. మూడు మార్గాల్లో రెండు లక్షలకు పైగా ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీ వేళల్లో నిలబడే ప్రయాణిస్తున్నారు.
ఇవీ చదవండి: