తెలంగాణ

telangana

ETV Bharat / city

Chiranjeevi: చిరంజీవి సంతోషం.. కారణం చిన్న విత్తన గింజ.! - చిరంజీవి సంతోషం

ఖాళీ సమయంలో తాను చేసిన ఓ పనికి వచ్చిన ప్రతిఫలం చూసి మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఓ స్పెషల్‌ వీడియోని గురువారం రాత్రి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Chiranjeevi happy
Chiranjeevi happy

By

Published : Dec 24, 2021, 12:40 PM IST

‘‘ఒక రైతు తన పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకువెళ్లేముందు ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో.. అందులో ఎంతో కొంత ఆనందాన్ని ఈరోజు నేను పొందుతున్నాను. దానికి కారణం.. కొన్ని నెలల క్రితం మా పెరట్లో ఓ సోరకాయ (ఆనపకాయ) గింజ నాటాను. అది పెద్ద పాదుగా మారి.. రెండు కాయలు కాశాయి. వాటిని ఈరోజు కోస్తున్నాను. ఆనందంగా ఉంది. పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే.. మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి! అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి నా సెల్యూట్’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

చిరు షేర్‌ చేసిన వీడియోపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ‘‘మీ ఆనందాన్ని చూస్తుంటే మాకూ సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడూ మాలో స్ఫూర్తి నింపుతూనే ఉంటారు’’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ‘ఆచార్య’ రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. మోహన్‌రాజాతో ‘లూసిఫర్‌’ రీమేక్‌.. మెహర్‌రమేశ్‌తో ‘వేదాళం’ రీమేక్‌.. బాబీతో మరో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించారు.

ABOUT THE AUTHOR

...view details