తెలంగాణ

telangana

ETV Bharat / city

జీహెచ్​ఎంసీలో కొనసాగుతున్న ఫీవర్​ సర్వే - తెలంగాణ తాజా వార్తలు

జీహెచ్​ఎంసీలో పీవర్​ సర్వే కొనసాగుతోంది. మంగళవారం 2,04,490 ఇళ్లలో జీహెచ్​ఎంసీ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బృందాలు సర్వే చేశాయి.

GHMC FEVER SURVEY
జీహెచ్​ఎంసీలో కొనసాగుతున్న ఫీవర్​ సర్వే

By

Published : May 19, 2021, 5:20 AM IST

కొవిడ్​ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్​లో జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖలకు చెందిన 1735 బృందాలు మంగళవారం 2,04,490 ఇళ్లలో సర్వే చేశాయి.

ఒక ఏఎన్​ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్​తో కూడిన బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరంతో బాధ పడుతున్నవారి వివరాలను సేకరించాయి. జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాంటీలార్వా ద్రావణాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది పిచికారి చేస్తున్నారు.

నగరంలో ప్రతీ బస్తీ దవాఖానా, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర ఆస్పత్రుల్లో అవుట్​ పేషెంట్లకు​ జ్వర పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అన్ని ఆసుపత్రుల్లో 17,301 మందికి పరీక్షలు నిర్వహించారు. అలా ఇప్పటివరకు ఆసుపత్రుల ద్వారా మొత్తం 2,37,188 మందికి జ్వర పరీక్షలు చేశారు.

ఇవీచూడండి:'కొవిడ్‌ కట్టడిలో తెలంగాణ దేశానికే మార్గనిర్దేశంగా మారింది'

ABOUT THE AUTHOR

...view details