సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణరాజును గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు ఆర్మీ డాక్టర్ల నేతృత్వంలో.. ఆయనకు వైద్యపరీక్షలు జరుగుతున్నాయి. ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామకు వైద్యపరీక్షలు - ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామకు వైద్యపరీక్షలు
ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి ఆయణ్ను పోలీసులు.. గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
రఘురామకృష్ణ వైద్య పరీక్షలను జ్యుడీషియల్ అధికారి నాగార్జున పర్యవేక్షిస్తున్నారు. వైద్య పరీక్షలను డాక్టర్లు వీడియోగ్రఫీ చేస్తున్నారు. జ్యుడీషియల్ అధికారి షీల్డ్ కవర్లో నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు. చికిత్స కాలాన్ని జ్యుడీషియల్ కస్టడీగా భావించాలని సుప్రీం తెలిపింది.
మరోవైపు.. విచారణ పేరుతో.. ముసుగు వేసుకొని కొందరు దారుణంగా కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. వారిలో సునీల్‌కుమార్ అనే డీజీ కూడా ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు. తనను హతమార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
TAGGED:
తెలంగాణ వార్తలు