Medaram sammakka saralamma jatara Invitation Card: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రత్యేకతను చాటిచెప్పేలా... గిరిజన కళలు, హస్తకళల బహుమతులతో కూడిన జాతర ఆహ్వాన పత్రికను తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఆహ్వాన పత్రిక, టేబుల్ బుక్, కోయ, గోండ్ పెయింటింగ్స్, నాయకపు గిరిజన దారు శిల్పాలు, ఓజా గోండ్ క్రాఫ్ట్స్, బంజారా క్రాఫ్ట్స్, సమాచార స్టిక్కర్లతో ఆహ్వన పత్రికను గిరిజన సంక్షేమ శాఖ అందిస్తోంది.
మేడారం జాతర ప్రత్యేకతను తెలిపేలా ఆహ్వన పత్రిక ఈ నెల 16 నుంచి 19 తేదీల మధ్య జరిగే జాతర రోజువారీ కార్యక్రమాల వివరాలు ఆహ్వాన పత్రికలో పొందుపరిచారు. టేబుల్ బుక్ గిఫ్ట్ బాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిలో తెలంగాణ గిరిజనుల జీవనం, సంస్కృతికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను ఆకర్షణీయమైన చిత్రాలతో స్థూలంగా వివరించారు.
మేడారం జాతర ప్రత్యేకతను తెలిపేలా ఆహ్వన పత్రిక గిఫ్ట్ బాక్స్‌లో ఏమున్నాయంటే..
గిఫ్ట్ బాక్స్‌లో అందమైన ఫ్రేమ్‌లలో అమర్చిన కోయ, గోండ్ పెయింటింగ్‌లు ఉన్నాయి. వీటిని సాంప్రదాయక పద్ధతిలో ఆయా గిరిజన యువ కళాకారులు గీశారు. నాయకపు గిరిజన కళాకారులు ప్రత్యేకంగా రంగురంగులతో తయారు చేసిన శిరస్సులు అనే దారు కళాఖండాలనూ ఈ బాక్స్ లో అమర్చారు. మైనపు సాంకేతికతతో ఓజా గోండ్స్ తయారు చేసిన ఇత్తడి క్రాఫ్ట్ తాబేలును కూడా బాక్స్‌లో ఉంచారు.
మేడారం జాతర ప్రత్యేకతను తెలిపేలా ఆహ్వాన పత్రిక ప్రముఖులను ఆహ్వానించడానికి..
లంబాడీ స్త్రీలు నేసిన బంజారా హస్తకళ పొట్లీ పౌచ్‌లో శ్రీ సమ్మక్క దేవి పవిత్రమైన పసుపు పొడిని పెట్టెలో అమర్చారు. ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు, వీవీఐపీలను ఆహ్వానించడానికి ఈ అమూల్యమైన గిఫ్ట్ బాక్స్‌ను గిరిజన సంక్షేమ శాఖ అందజేసి ఆహ్వానిస్తోంది.
ఇదీ చూడండి:RTC Reduces Bus Fare: ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం..