తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2021, 2:34 PM IST

ETV Bharat / city

మొబైల్ టాయిలెట్లను ప్రారంభించిన మేయర్

హైదరాబాద్‌లో మరో ఏడు మొబైల్ టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ కలిసి వీటిని ప్రారంభించారు.

Hyderabad mayor, mobile toilets
మేయర్ విజయలక్ష్మి, మొబైల్ టాయిలెట్లు

హైదరాబాద్ జంట నగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు మొబైల్ టాయిలెట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా రూపొందించి వీటిలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఇప్పటికే 30 మొబైల్ టాయిలెట్లు నగర వాసులకు అందుబాటులో ఉండగా... ఖైరతాబాద్ జోన్‌కు కేటాయించిన మరో ఐదింటిని మేయర్ విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రారంభించారు. నెక్లెస్ రోడ్‌లోని పార్కింగ్ యార్డులో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఈ మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు మేయర్ విజయలక్ష్మీ తెలిపారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు టాయిలెట్స్‌తో పాటు పాలిచ్చే తల్లులకు ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్‌ ఉందని పేర్కొన్నారు. ఈ బస్సు వెనుక భాగంలో స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయానికిగానూ చిన్న దుకాణం ఏర్పాటుకు సౌకర్యం కల్పించామని అన్నారు. సోలార్ పవర్ విధానం కల్పించిన ఈ మొబైల్ టాయిలెట్ నిర్వహణను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చామని వివరించారు.

ఇదీ చదవండి:Etela : హైదరాబాద్​ చేరుకున్న ఈటల బృందం

ABOUT THE AUTHOR

...view details