తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి - సనత్​నగర్​లో పెళ్లైన 20 రోజులకై వివాహిత ఆత్మహత్య

ప్రేమ వివాహం చేసుకున్న 10 రోజులకే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది.  హైదరాబాద్​ సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్, తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.

married women suicide at sanatnagar hyderabad
ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

By

Published : Dec 4, 2019, 11:37 AM IST

Updated : Dec 4, 2019, 3:22 PM IST

హైదరాబాద్ సనత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో విషాదం చోటుచేసుకొంది. రామారావునగర్​లోని ఇంట్లో అన్నపూర్ణ (పూర్ణిమ) అనే వివాహిత నిన్న సాయంత్రం అనుమానాస్పద రీతిలో మృతిచెందింది.

మెడ, తలపై గాయాలు..

టెక్​ మహీంద్రాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న అన్నపూర్ణ గత నెల 22న.. దాసరి కార్తిక్​ అనే స్థిరాస్తి వ్యాపారిని ప్రేమ వివాహం చేసుకొంది. మహిళ తల్లిదండ్రులు అంగీకరించకపోవడం వల్ల వారిని ఎదిరించి ఆర్య సమాజ్​లో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం సాయంత్రం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పేర్కొన్నారు. మృతురాలి మెడ, తలపై గాయాలున్నాయని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. మృతురాలి భర్త కార్తిక్​ను​ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటన ప్రాంతంలో సూసైడ్​ నోట్ లభించిందని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

భర్తపైనే అనుమానం..

మద్యం మత్తులో భర్తే హత్య చేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సనత్​నగర్​ పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళనకు దిగారు.

ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

ఇవీచూడండి: దత్తత తల్లిదండ్రుల వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య

Last Updated : Dec 4, 2019, 3:22 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details