తెలంగాణ

telangana

ETV Bharat / city

భవిష్యత్​ చిట్​ఫండ్‌ కంపెనీలదే: శైలజా కిరణ్ - etv bharat

మార్గదర్శి చిట్​ఫండ్‌ ఎండీ శైలజా కిరణ్​ను... అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డుతో సత్కరించింది. ఆర్‌బీఐ పార్ట్‌టైం డైరెక్టర్‌ ఎస్‌ గురుమూర్తి ఈ అవార్డు ప్రదానం చేశారు.

భవిష్యత్తు చిట్​ఫండ్‌ కంపెనీలదే: శైలజా కిరణ్

By

Published : Sep 29, 2019, 6:46 AM IST

భవిష్యత్తు చిట్​ఫండ్‌ కంపెనీలదే: శైలజా కిరణ్

చిట్‌ఫండ్‌ రంగాన్ని యజమానుల్లా కాకుండా సంరక్షకుల్లా నిర్వహించాలని మార్గదర్శి చిట్​ఫండ్‌ ఎండీ శైలజా కిరణ్‌ పేర్కొన్నారు. అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ శైలజా కిరణ్‌ను బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డుతో సత్కరించింది. ఆర్‌బీఐ పార్ట్‌టైం డైరెక్టర్‌ ఎస్‌ గురుమూర్తి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శైలజా కిరణ్‌ ఈటీవి భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. సంప్రదాయ చిన్నమొత్తాల పొదుపు విధానంగా చిట్‌ ఫండ్‌ రంగాన్ని శైలజా కిరణ్‌ అభివర్ణించారు. 50 ఏళ్ల క్రితం బ్యాంకింగ్ రంగం వృద్ధి చెందుతున్న దశలో చిట్‌ఫండ్‌ రంగం దెబ్బతింటుందని భావించారని... కానీ, అలా జరగలేదని అన్నారు. ఇప్పటికీ చిట్‌ఫండ్‌ వ్యాపారాలు బాగా నిర్వహిస్తున్నామని... యువతనూ ఈ రంగంవైపు వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details