ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. గత నెల 22, 23న ఆంధ్రప్రదేశ్లోని గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీలో జరిగిన రెండు ఎదురుకాల్పుల ఘటనలో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరొక మహిళా మావోయిస్టు నాయకురాలు గాయాలతో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆవిర్భావ వారోత్సవాలు సందర్భంగా సమావేశం నిర్వహించేందుకు వెళ్తుండగా ఏకపక్షంగా కాల్చిచంపారని మావోయిస్టులు ఆరోపిస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు.
బంద్‌కు మావోయిస్టుల పిలుపు... ఏవోబీలో ఉద్రిక్తత - vishakha
రేపు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏవోబీలో ఉద్రిక్తత నెలకొంది. దాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు.
అప్రమత్తమైన పోలీసులు...
మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో సీలేరులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంద్ సందర్భంగా విధ్వంస సంఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే ఏవోబీ సరిహద్దులకు చేరుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, జిమాడుగుల, డుంబ్రిగూడ, పెదబయలు, ముంచింగ్ పుట్ పోలీస్ స్టేషన్ లకు అదనపు పోలీసు బలగాలను అధికారులు తరలించారు. సీలేరు జలవిద్యుత్కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి-మూడేళ్లు సమయం ఇవ్వండి.. మార్పు మీరే చూడండి!