Maoist Leader Savitri surrenders : మరో మావోయిస్టు అగ్రనేత పోలీసులకు లొంగిపోయారు. కిష్టారం ఏరియా కమిటీకి సెక్రటరీగా వ్యవహరించే సావిత్రి పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈమె 1994లో దళం సభ్యురాలుగా చేరింది. అయితే గతేడాది తన కుమారుడు రంజిత్ సైతం పోలీసులకు లొంగిపోయాడు. ఆమె లొంగిపాటుతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.
Maoist Savitri surrender: పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత - Maoist leader Savitri surrendered
Maoist Leader Savitri surrenders : కిష్టారం ఏరియా కమిటీకి సెక్రటరీగా వ్యవహరిస్తున్న మావోయిస్ట్ అగ్రనేత సావిత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.
మావోయిస్టు లొంగిపాటు
ఈమె మావోయిస్టు దండకారణ్య కమిటీ సెక్రటరీ, డెేంజరస్ రామన్న భార్య. అయితే 1994లో రామన్న.. దళం సభ్యురాలైన సావిత్రిని వివాహం చేసుకున్నాడు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఇతనిపై గతంలో పోలీసులు రూ.40లక్షల రివార్డును ప్రకటించారు. కానీ 2019లో గుండెపోటుతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ప్రాణాలను విడిచాడు.
Last Updated : Sep 21, 2022, 12:58 PM IST