తెలంగాణ

telangana

ETV Bharat / city

'నకిలీ విత్తనాలు కొనుగోలు.. పంట నష్టపోయిన ఎమ్మెల్యే' - fake seeds latest news

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంట నష్టపోయారు ఆయన. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తనకే ఇలా జరిగితే.. కౌలు రైతు పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే అధికారులను నిలదీసినట్లు సమాచారం.

mla alla ramakrishna who bought fake seeds and lost crop
'నకిలీ విత్తనాలు కొనుగోలు.. పంట నష్టపోయిన ఎమ్మెల్యే'

By

Published : Oct 26, 2020, 7:25 PM IST

Updated : Oct 27, 2020, 12:12 PM IST

నకిలీ విత్తనాల సంస్థలు ఏకంగా ప్రజాప్రతినిధినే బురిడీ కొట్టించాయి. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి.. ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో 14 ఎకరాలు పొలం ఉంది. ఈ ఏడాది జూన్​లో ఎమ్మెల్యేనే ఏపీ సీడ్స్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ వద్ద 125 కిలోల బీపీటీ 5204 రకాన్ని కొనుగోలు చేశారు. 14 ఎకరాలలో పంటవేయగా అక్టోబర్​లో దాదాపు 20శాతం పంట ముందుగానే వచ్చింది. మిగిలిన 80శాతం పంట పూత దశలో ఉంది. స్వయంగా ఎమ్మెల్యే ఆర్కేనే పంటను చూసి దిగులు చెందారు. పూత వచ్చిన పంట చేతికందేది లేదని గ్రహించి అధికారులను సంప్రదించారు. దీనిపై మూడు రోజుల క్రితం జిల్లా వ్యవసాయ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు అధికారులు పంటను పరిశీలించారు. మరో మూడు రోజుల్లో నివేదిక వస్తోందని రాగానే ఏపీ సీడ్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తనకే ఇలా జరిగితే మిగతా రైతుల పరిస్థితి ఏంటని అధికారులను ఎమ్మెల్యే నిలదీసినట్లు తెలిసింది. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఒక వైపు విత్తన చట్టం కఠినంగా అమలవుతున్నా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.

ఇదీ చదవండి:సీఎంకు ఎన్నికలపై ఉన్న ప్రేమ రైతులపై లేదు: ఎల్​.రమణ

Last Updated : Oct 27, 2020, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details