తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసులకు మాస్కులు, శానిటైజర్​ అందించిన ఎన్జీవో

కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో కూడా.. ప్రాణాలు లెక్క చేయకుండా విధులు నిర్వహించిన పోలీసుల సేవలు మరిచిపోలేనివని.. ఎంతోమంది ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డేశారన్నారు మన స్పందన ఫౌండేషన్​ సభ్యులు. పోలీసులకు తమ వంతు ప్రోత్సాహకంగా రెండువేల శానిటైజర్​ సీసాలు, రెండువేల ఎన్​ 95 మాస్కులను సంస్థ సభ్యులు రాచకొండ కమిషనర్​ మహేష్​ భగవత్​కి అందించారు.

Mana Spandana Foundation Donates Masks And Sanitiser To Police
పోలీసులకు మాస్కులు, శానిటైజర్​ అందించిన ఎన్జీవో

By

Published : Oct 1, 2020, 9:22 PM IST

కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో పోలీసులు ముందుండి విధులు నిర్వహించారని.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేసిన పోలీస్​ వారియర్స్​కి తమ వంతు సాయంగా మన స్పందన ఫౌండేషన్​ ఆధ్వర్యంలో రాచకొండ కమిషనర్​ మహేష్​ భగవత్​ చేతుల మీదుగా రెండువేల ఎన్​ 95 మాస్కులు, రెండు వేల శానిటైజర్​ సీసాలు అందించారు.

పోలీసులకు మాస్కులు, శానిటైజర్​ అందజేసిన ఫౌండేషన్​ సభ్యులను రాచకొండ కమిషనర్​ మహేష్​ భగవత్​ అభినందించారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించడం గొప్ప విషయమని.. ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి.. శానిటైజర్​ వాడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మనస్పందన ఫౌండేషన్‌ ఛైర్మన్‌ మోహన్‌ నాయక్‌, ప్రపంచ వరల్డ్‌ రికార్డు గ్రహీత, దక్షిణ భారత పర్వతారోహకుడు అంగోత్ తుకారాం పాల్గొన్నారు.

ఇదీ చూడండి:విచారణలో సంచలన విషయాలు బయటపెట్టిన అవంతి తండ్రి

ABOUT THE AUTHOR

...view details