బ్లాక్ ఫంగస్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి స్విమ్స్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. తన భర్త మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతని భార్య ఆరోపించింది. ఈ ఘటనకు కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగింది.
BLACK FUNGUS: బ్లాక్ ఫంగస్‌తో ఏపీలో వ్యక్తి మృతి.. స్విమ్స్ ముందు భార్య ఆందోళన - black fungus cases in andhra pradesh
ఏపీలోని తిరుపతి స్విమ్స్‌లో బ్లాక్ ఫంగస్ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని మృతుని భార్య ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగింది.
తిరుపతిలో బ్లాక్ ఫంగస్‌తో వ్యక్తి మృతి
ఏపీలోని కడప జిల్లా చక్రాయపేట గ్రామానికి చెందిన ఆంజనేయులు నాయక్ (38)కు బ్లాక్ ఫంగస్ సోకటంతో.. మే 28న తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఫంగస్ మెదడుకు వ్యాపించడంతో.. బుధవారం తెల్లవారుజూమున అతడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే తన భర్తను చంపేసిందని మృతుని భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఇదీ చదవండి:రౌడీషీటర్ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్