తెలంగాణ

telangana

ETV Bharat / city

'కిషన్ రెడ్డిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్' - బెదిరింపులు

ఓ వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డిని అంతుచూస్తానంటూ ఫోన్లో బెదిరించాడు. కంగుతిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కిషన్ రెడ్డిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్

By

Published : Jul 24, 2019, 6:42 AM IST

Updated : Jul 24, 2019, 7:26 AM IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని బెదిరించిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా కిషన్​రెడ్డిని ఫోన్లో నీ అంతు చూస్తానంటూ.. పలుమార్లు బెదిరించాడు. ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా బెదిరింపులకు గురి చేశాడు. జూన్ 12న మంత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్​ క్రైమ్​పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్​గా గుర్తించారు. మంగళవారం అతన్ని అరెస్టు చేశారు.

కిషన్ రెడ్డిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
ఇవీ చూడండి : గవర్నర్ ఆమోదం పొందిన కొత్త పురపాలక చట్టం
Last Updated : Jul 24, 2019, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details